
మనమందరం తెలిసో తెలియకనో ఏదో ఒక మానసిక ఉచ్చులో పడతాం.
మానసిక ఉచ్చులను క్రింద విధంగా వర్గీకరించవచ్చు.
- భావోద్వేగ ఉచ్చు
- సామాజిక ఉచ్చు
- మతపరమైన ఉచ్చు
- కుల ఉచ్చు
- రాజకీయ ఉచ్చు
- మొదలైనవి
మనం జన్మించినప్పుడు మనం మొదటగా తల్లితో, తదుపరి తండ్రి మరియు బంధువులతో మనోద్వేగంతో కలుస్తాం. ఇక్కడ, మొదటగా భావోద్వేగ ఉచ్చు ప్రారంభమవుతుంది.

కొన్ని రోజులు తర్వాత, దేవుడు అని పిలిచే ఒక ఊహాత్మక విషయం గురించి విశ్వాసాలు మనపై రుద్దబడుతాయి. ఆ తర్వాత దేవాలయాలకు వెళ్లడం, మరియు పండుగలు జరుపుకోవడం లాంటివి ప్రారంభిస్తాము. ఇక్కడ, మతపరమైన ఉచ్చు మొదలవుతుంది.

పాఠశాలల్లో చేరిన తర్వాత, మనం కొత్త స్నేహితులతో, ఉపాధ్యాయులతో మరియు సమాజంతో సంప్రదించడం ప్రారంభిస్తాము. ఇక్కడ, సామాజిక ఉచ్చు మొదలవుతుంది.
సమయంతో పాటు మనం వేర్వేరు కులాలు, మతాలు, భాషలు మరియు దేశాల గురించి తెలుసుకుంటాము. ఆ తర్వాత మనం ‘మన దేశం/ భాష / మతం / కులం గొప్పది’ అని బోదింపబడతాం. మన పూర్వీకులు ఏదైతే అనుసరిస్తున్నారో అవి గొప్పవి అని నమ్మడం ప్రారంభిస్తాం. ఇది పరోక్షంగా ఇతరుల విశ్వాసాలు గొప్పగా కావని చెబుతుంది. రోజు రోజుకి, ఈ విశ్వాసాలు మెల్లగా బలోపేతం అవుతాయి, కొన్ని సార్లు ఇవి ఇతరుల విశ్వాసాల పట్ల ద్వేషాన్ని పెంచవచ్చు.

ఇప్పుడు, రాజకీయాల దగ్గరికి వద్దాం. ప్రతి ఎన్నికలకు, మన చుట్టూ జరిగే రాజకీయ చర్చల ద్వారా మనం రాజకీయాలు, మరియు రాజకీయ పార్టీల గురించి అర్థం చేసుకుంటాం. మనం పలాన రాజకీయ పార్టీ పలాన కారణాల వల్ల మంచిది అని మనం చెప్పబడుతాం, అప్పుడు మనం ఆ రాజకీయ పార్టీని అనుసరించడం ప్రారంభిస్తాం.

ఇప్పుడు, లైంగిక ఆకర్షణల గురించి మాట్లాడుకుందాం. వయస్సుతో పాటు, శరీరంలో లైంగిక హార్మోన్లు ప్రేరేపించడం మొదలవుతుంది, తదనుగుణంగా మనము వ్యతిరేక లింగానికి ఆకర్షితులవడం, ఆ తర్వాత ఆ వ్యక్తితో ఒక బలమైన సంబంధం ఏర్పడటం జరుగుతుంది. ఇది మరొక భావోద్వేగ ఉచ్చు.

ఒక ఉచ్చులో పడిపోవడం చెడ్డది అని నేనట్లేదు. కానీ, మనం ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, మనం క్రింది వాటిని పాటించాలి:
- వివేకం
- హేతుబద్ధత
- ఆచరణాత్మకత
- షరతులతో కూడిన
- మృదుత్వం
అంతిమంగా, నేను చెప్పేది ఏంటంటే:
గుడ్డిగా ఎలాంటి వలలో పడకండి. మీ అవగాహన మరియు కోరిక మేరకు ఒక ఉచ్చు నుండి బయటకు వచ్చి మరొక సరియైన మార్గాన్ని ఎంచుకోవడానికి అనువుగా ఉండండి.