మీకు తెలుసా GHMC ఆస్తి పన్నులో 8% గ్రంథాలయాల పన్ను యేతర రుసుం కింద, అంటే ఆర్థిక సంవత్సరానికి సుమారుగా 175 కోట్ల రూపాయల మొత్తాన్ని వసూలు చేస్తుందని?
హైదరాబాద్ లో మీకు దగ్గరలో ఎక్కడైన గ్రంథాలయం ఉందా?
నేను ఉండే బంజారా హిల్స్ సమీపంలో మాత్రం ఒక్క గ్రంథాలయం కూడా లేదు.
దీనిని ప్రక్కన పెడితే, GHMC లో ఉన్న ప్రస్తుత గ్రంథాలయాల పరిస్థితి చూడండి.
1. స్థల పరిమితుల కారణంగా విద్యార్థుల వెలుపల కూర్చుని ఉన్నారు.


2. స్వచ్చ హైదరాబాద్ గురించి చాలా ప్రకటనలు చేస్తున్నప్పటికీ GHMC నిర్వహిస్తున్న గ్రంథాలయాలలోని మరుగుదొడ్లు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయి.


3. ఇది సంచాలక గ్రంథాలయాల పరిస్థితి!!

4. ఇదీ గ్రంథాలయాలలోని మౌళిక సదుపాయాల పరిస్థితి



90 కన్నా ఎక్కువ లైబ్రరీలను నిర్వహిస్తున్న నగర గ్రంథాలయ సంస్థకు GHMC సమీకరించిన పన్ను యేతర రుసుంను మొత్తం చెల్లించవల్సి ఉంటుంది.
మీరు పైన చూసినట్లుగా, నగరంలోని చాలా గ్రంథాలయాలు సరియైన సౌకర్యాలు లేక శిథిలావస్థలో ఉన్నాయి మరియు వాటిలో చాలా వరకు నిధుల కొరత కారణంగా మూసివేయబడ్డాయి.
వీటన్నింటిని చూసి, లోక్ సత్తా పార్టీకి చెందిన యువ సభ్యుడు దొంతినేని నరసింహ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం, GHMC ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదంతా జరిగి కూడా ఒక సంవత్సరం జరిగింది. అయినప్పటికీ, ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.అయితే, ప్రస్తుతం GHMC అధికారులు మాత్రం ఈ సంస్థ డిజిటల్ లైబ్రరీల వైపు దృష్టిసారిస్తున్నరని చెబుతున్నారు.
@ప్రియమైన GHMC, ఇప్పటికైన మేలుకొండి, చెప్పడం కాదు మరియు తక్షణమే చర్యలు తీసుకోండి.
మా గ్రంధాలయాలు మాకు కావాలి !!