తెలుగు రాష్ట్రాల్లో నిజాయితీ కలిగిన రాజకీయ పార్టీల పొత్తు?

రాజకీయం యొక్క ముఖ్యోద్దేశం సుపరిపాలన అందించడం.

ఒకప్పుడు నీతిగా, నిజాయితీగా పని చేసే రాజకీయ పార్టీలు దొరకడం అరుదుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. విధి విధానాలు వేరయిప్పట్టికి స్వచ్చమైన రాజకీయాన్ని అందించడానికి ఈ మధ్య కాలంలో చాలా పార్టీలు ఏర్పడ్డాయి మరియు దగ్గరలో కొత్తవి కూడా ఏర్పడబోతున్నాయి.

ఆ పార్టీలు ఏంటంటే:

  • జనసేన
  • లోక్ సత్తా
  • తెలంగాణ జన సమితి
  • ఆమ్ ఆద్మీ
  • సి.పి.ఐ.
  • సి.పి.ఎం.

మరియు JD లక్ష్మీ నారాయణ (Retired IPS officer, Ex CBI officer) గారు ఏర్పాటు చేయబోయే పార్టీ

వేరే పార్టీలతో షరతులతో కూడిన పొత్తులు పెట్టుకున్నప్పటికి ఈ పార్టీలు ఇప్పటి వరకు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారని గాని, అవినీతి చేస్తున్నారని గాని అనడానికి ఎలాంటి దాఖలాలు లేవు.

ఇలాంటి నిజాయితీగా పని చేసే పార్టీలన్నీ కలసి ఒక కూటమిగా ఏర్పడి రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తే బాగుంటుందని నాబోటి లాంటి వారి కోరిక.

ఇలాంటి పార్టీలు గనుక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు ఢిల్లీ తరహాలో లాగా ప్రజలకు మంచి పరిపాలన అందుతుంది, మరియు సింగపూర్ లాంటి బలమైన, అవినీతి రహిత వ్యవస్థ తప్పక ఏర్పాటు అవుతుంది.

2 thoughts on “తెలుగు రాష్ట్రాల్లో నిజాయితీ కలిగిన రాజకీయ పార్టీల పొత్తు?

    1. As TJS had alliances with Congress, the opinion would have come. But, Kondandaram and team is good. As you know about JP & Loksatta, it never supports corrupt parties.

      Like

Leave a comment