అసలు రాజకీయం యొక్క ప్రధాన లక్ష్యం సుపరిపాలన అందించడం.
సుపరిపాలన అంటే:
- సమస్యలకు మెరుగైన పరిష్కారాలు అందించడం
- సత్వర మరియు సమాన న్యాయం కల్పించడం
- అందరికి ఎదిగే అవకాశాలు కల్పించడం
- అవినీతి రహిత వ్యవస్థను ఏర్పాటు చేయడం
- బడుగు బలహీన వర్గాలను బలపరచడం
కాని ప్రస్తుతం ప్రజల బలహీనతలనే లక్ష్యం చేసుకుని తప్పుడు దారుల్లో వెళ్తేనే గాని ఎన్నికల్లో గెలవని పరిస్థితి ఏర్పడింది.
అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపే ప్రధానం. గెలవడం కోసం ఇంచుమించుగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎంతకైన తెగిస్తాయి. దానికి పర్యవసానాలే డబ్బులు, మద్యం పంచడం, ప్రజాకర్షక పథకాలు, మొదలగునవి.
ప్రస్తుత పరిస్థితుల్లో చిత్త శుద్ధి లేని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు గెలవడం వల్ల చాలా మందికి రాజకీయం అంటేనే అసహ్యం వచ్చేంతలా తయారయ్యింది.
ఇలాంటి రాజకీయాలను అంతమొందించానికి, మంచి నీతి నిజాయితీ కూడిన రాజకీయాలను అందించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సత్తా పార్టీ రూపంలో ప్రయత్నం జరిగింది. అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ ప్రయత్నం విఫలమైంది. అందుకే ప్రస్తుతం లోక్ సత్తా పార్టీ ఎన్నికల రాజకీయాలకు విరామం ప్రకటించింది.

అలాంటి ప్రయత్నమే ఇప్పుడు 2019 లో “జనసేన” పార్టీ రూపంలో జరుగుతోంది. ఇప్పుడు ఆ పార్టీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానంటొంది, 25 కిలోల బియ్యం కాదు 25 ఏండ్ల మంచి భవిష్యత్తును అందిస్తానంటుంది. అవినీతి రహిత పాలనను ఇస్తానంటొంది, మరియు ఉచిత హామీలు కాకుండా స్వశక్తితో ఎదిగే అవకాశాలు కల్పిస్తానంటొంది.

ఆ పార్టీ సిద్దాంతాలు కూడా మిగతా సాంప్రదాయ పార్టీలకు చాలా భిన్నంగా ఉన్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న కుల, మత, ప్రాంత, ధన రాజకీయాలకు ప్రత్యామ్నంగా సరికొత్త రాజకీయాలను అందించడానికి ముందుకొచ్చిన “జనసేన” పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గెలవడం ఒక చారిత్రాత్మక అవసరం.